భార్య, ముగ్గురు కూతుళ్ల హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రాజస్థాన్

జైపూర్‌లో భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన రాహుల్ ఝా విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. మొదట పెద్ద కూతురిని మాత్రమే చంపాలని భావించినట్లు తెలిపాడు. అయితే తాను అరెస్టయితే కుటుంబం అక్రమ మార్గాలు పడుతుందనే వికృత ఆలోచనతోనే భార్యతో సహా నలుగురిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిద్రలో ఉన్న వారిని సిమెంట్ దిమ్మెతో మోది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.