చౌటుప్పల్ హైవేపై మూడు కిలోమీటర్ల మేర భారీగా స్తంభించిన వాహనాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొయ్యలగూడెం నుంచి కైతాపురం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కైతాపురం వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కారణంగా వాహనాలను వన్వేలో మళ్లిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవించారు.