ప్రజల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమంటూ గూడూరులో సునీల్ కుమార్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
భయపెట్టే పాలన కాకుండా ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వమే కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ నాయకులు పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల భూములకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు అందించడం, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరవేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గూడూరు ప్రాంత సర్వతోముఖ అభివృద్ధే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.