అమరావతి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఏడీ, హెచ్‌ఓడీ ఐకానిక్‌ టవర్ల ఫసాడ్‌ నిర్మాణం, నాణ్యత, భద్రతా ప్రమాణాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.