'మాజీ మంత్రి కారుమూరి కస్టడీకి': విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉంచిన ఆయన్ను పీటీ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. ఈ కేసు విచారణ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టులో కారుమూరిని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు.