హర్యానాలో గుంటూరు బాలిక కిడ్నాపర్ అరెస్ట్ చేసిన పోలీసులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గుంటూరు
గుంటూరులో పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన షేక్ జాన్ సైదాను హర్యానాలోని కర్నాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఆచూకీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్నారు. మాయమాటలతో బాలికను తీసుకెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ నేపథ్యంలో ఈ కేసులో వేగంగా కదలిక వచ్చింది.