టీమ్ ఇండియా ఘన విజయం: పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఏషియన్ గేమ్స్ ఫైనల్లోకి
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై నాలుగుకు మూడు గోల్స్ తేడాతో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించిందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అపురూప విజయంతో మన క్రీడాకారులు ఫైనల్లోకి దూసుకెళ్లారని ఆయన తెలిపారు. చాంపియన్లుగా నిలిచిన మన జట్టు సభ్యులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తుది పోరులో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.