స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేయడంపై ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపైనా, రాష్ట్రంలో అమలు చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపైనా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.