నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరికుంటపాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. పర్యటనలో భాగంగా భద్రత మరియు ఇతర వసతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్వయంగా రామాపురం ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. రాబోయే ఈనెల 27వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు జేశారు.