బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చందేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్‌పూర్ గ్రామంలో పొలంలోని బావిలో స్నానం చేయడానికి వెళ్లిన నలుగురు మైనర్ అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.