మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
గోదావరిఖని రామగుండం నియోజకవర్గంలోని మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో శారదా నగర్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మూడు వందల ఉచిత కుట్టు మిషన్లను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.