ఇరాన్‌తో ఒప్పందంపై అమెరికా ప్రత్యేక రాయబారుల కీలక చర్చలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్‌తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రత్యేక రాయబారులు ఇరాన్ ప్రతినిధులతో మంగళవారం చర్చలు జరిపారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ బృందంతో సమావేశమైందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే సర్వనాశనం తప్పదని, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.