ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా మరో రెండు రోజులు సమయం పెంచినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి.