పెదకాకానిలో భక్తులపై పసుపు నీళ్ల చల్లింపు.. నిరసనలతో ఉద్రిక్తత
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: పెదకాకాని
పెదకాకానిలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు సమర్పించేందుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి నివాసం నుంచి భక్తులు, వైసీపీ నాయకులు శివాలయానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. వారు వెళ్తున్న మార్గంలో టీడీపీ నాయకులు పసుపు నీళ్లు చల్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పవిత్రమైన నాంతాడు ఊరేగింపు మార్గంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటని భక్తులు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల తీరుపై భక్తులు మండిపడుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.