జండా బాలాజీ ఆలయ హుండీ ఆదాయం రూ.6.87 లక్షలని వెల్లడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్లోని ప్రముఖ శ్రీ జండా బాలాజీ దేవస్థానంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపును అధికారులు పారదర్శకంగా నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నోట్ల రూపంలో రూ.6,01,740, నాణేల రూపంలో రూ.85,461 కలిపి మొత్తం రూ.6,87,201 ఆదాయం లభించింది. వీటితో పాటు 7 గ్రాముల మిశ్రమ బంగారం, 485 గ్రాముల మిశ్రమ వెండి కానుకలుగా వచ్చినట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్. సుజాత రెడ్డి, ఈవో ఎస్. ఆంజనేయులు సమక్షంలో అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.