రూపాయల పదిహేను లక్షల సగటు క్లెయిమ్ చెల్లించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఆర్థిక సంవత్సరం 2026లో పాలసీదారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి సగటున పదిహేను లక్షల రూపాయల చొప్పున డెత్ క్లెయిమ్‌లను చెల్లించి పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అండర్‌రైటింగ్ అండ్ రిటైల్ క్లెయిమ్స్ చీఫ్ సారంగ్ గోఖలే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐదు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించామని, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి తొమ్మిది శాతానికి పైగా నమోదైందని ఆయన పేర్కొన్నారు.