మధ్యప్రదేశ్లో సంచలనం: డ్రైవర్ ఉద్యోగం చేస్తూ రూ.68 కోట్ల ఆస్తులు కూడబెట్టిన కానిస్టేబుల్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఇండోర్

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పోలీసు శిక్షణ కళాశాలలో డ్రైవర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారని అధికారులు తెలిపారు. ఆయన 24 ఏళ్ల సర్వీసులో జీతం సుమారు రూ.75 లక్షలు మాత్రమే ఉండగా, మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.68 కోట్ల విలువైన యాభైకి పైగా స్థిరాస్తులను సంపాదించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.