రాష్ట్రంలో కొత్తగా 629 ఏఈ పోస్టుల భర్తీ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనకాపల్లి

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసే లక్ష్యంతో రాష్ట్రంలో ఆరు వందల ఇరవై తొమ్మిది ఏఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించిన జీఐఎస్ విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కేంద్రం ఏర్పాటు చేశామని, పరిశ్రమలకు విద్యుత్తు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.