హూతీల దాడులను నివారించేందుకు సౌదీ అరేబియా భారీ ఆఫర్: బిలియన్ డాలర్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: Riyadh
హూతీ రెబెల్స్ దాడులను నివారించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని నిపుణులు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, దాడులు ఆపాలని కోరుతూ హూతీలకు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు సమాచారం వెలువడింది. సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖద్ బిన్ సల్మాన్ టెహ్రాన్ లో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామాలపై సౌదీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామాలపై పశ్చిమాసియా రాజకీయాల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.