పిల్లలవలసలో ప్రశాంతంగా ముగిసిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పొందూరు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గురుగుబెల్లి నరసింహ మూర్తి, వైస్ చైర్మన్ గా గురుగుబెల్లి రాజ్యలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పది మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.