ఆంధ్రప్రదేశ్ చేబదులు పరిమితిని పెంచాలని ఆర్బీఐ కమిటీ సిఫార్సు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాష్ట్రాల స్వల్పకాలిక ఆర్థిక అవసరాల కోసం అందించే వేస్ అండ్ మీన్స్ చేబదులు పరిమితిని 11.2 శాతం మేర పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహా కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పరిమితి రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లకు పెరుగుతుందని కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే రోజులను కూడా తగ్గించాలని సదరు కమిటీ సూచించింది.