నగర వాసులకు తీపి కబురు: ఉస్మాన్ సాగర్ తాగునీటి మరమ్మతులు పూర్తి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి కష్టాల నుంచి భారీ ఉపశమనం లభించిందని జలమండలి అధికారులు వెల్లడించారు. ఉస్మాన్ సాగర్ తాగునీటి సరఫరా పైపులైన్ కు చేపట్టిన అత్యవసర మరమ్మతు పనులు నిర్దేశిత సమయం కంటే ముందే విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు. మణికొండ, టోలిచౌకి తదితర ప్రభావిత ప్రాంతాల్ లో తాగునీటి వృథాను అరికట్టడంలో ఈ పనులు ఎంతగానో దోహదపడతాయని, నీటి సరఫరాను త్వరలోనే పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.