ముంబైలో లాల్ బాగ్‌చా రాజాను దర్శించుకున్న నటుడు గోవింద
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద తన రాబోయే రూప చిత్రంలో సహనటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి ముంబైలోని ప్రసిద్ధ లాల్ బాగ్‌చా రాజా గణపతిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు తీసుకున్న ఈ నటీనటులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరిపై వచ్చిన పుకార్ల నేపథ్యంలో ఈ దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది.