నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టీకరణ
రిపోర్టర్: హరి
స్థలం: సిద్దిపేట
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి వెల్లడించారు. శుక్రవారం ములుగు, గజ్వేల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పునరావాసం, పరిహారం, ఇళ్ల స్థలాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ మంజూరు కాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీగా కాపాడాలని అధికారులను ఆదేశించారు.