షాకింగ్ ఘటన: హెలికాప్టర్ దిగుతుండగా తడబడి కిందపడబోయిన ఉషా వాన్స్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Washington
అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ మేరీలాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద హెలికాప్టర్ దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుతడబడి కిందపడబోయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. తన తొమ్మిది వారాల వయసున్న కుమారుడు అలెక్ నీల్ వాన్స్ను బేబీ క్యారియర్లో పట్టుకుని దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని, ఆమె వెంటనే రెయిలింగ్ పట్టుకుని ప్రమాదం నుంచి తేరుకున్నారని అధికారులు తెలిపారు.