స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు: జనసేన అధినేత పవన్తో తెదేపా నేతల భేటీ

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కూటమి నేతల మధ్య చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ భేటీలో పాల్గొని అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చిస్తున్నారు.