సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా!

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ వచ్చే సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాతో పాటు ‘కాకా’ కూడా సంక్రాంతి రేసులో ఉండటంతో, రెండు మెగా చిత్రాలు పండుగ బరిలో నిలుస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది.