సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె కారణంగా సెప్టెంబర్ నెల జీతాలు, వేతనాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25వ తేదీనే ముందస్తుగా జమ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ అడ్వాన్స్ చెల్లింపులను అక్టోబర్ నెల జీతాల నుంచి సర్దుబాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.