అమెరికాకు తొలి ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి చేసిన ఎస్ఎస్‌ఈఎల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Prayagraj

విద్యుత్‌ ప్రసార రంగంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ మరో మైలురాయిని చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో తయారైన తొలి 175 ఎంవీఏ, 345 కేవీ ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమెరికా మార్కెట్‌కు విజయవంతంగా ఎగుమతి చేసింది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ చంద్ర కొల్లా, ప్రెసిడెంట్ సుధీర్ వెన్నం మాట్లాడుతూ.. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో భవిష్యత్తులో మరిన్ని ఎగుమతులు చేపడతామని తెలిపారు.