రాయచూర్ లో విషాదం: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో నలుగురు మృతి

రిపోర్టర్: సురేష్ స్థలం: రాయచూర్

అప్పుల బాధ తాళలేక కర్ణాటకలోని రాయచూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. జలాల్ నగర్ ప్రాంతానికి చెందిన విష్ణురెడ్డి అనే వ్యక్తి తన భార్య అరుణతో పాటు ఇద్దరు పిల్లలకు ముందుగా విషం ఇచ్చి హత్య చేశాడు. అనంతరం చిక్కసగూరు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనపై మార్కెట్ యార్డ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.