ఘనంగా వినాయకుని ఊరేగింపు నిర్వహించిన నారాయణవనం మండల ప్రజలు
రిపోర్టర్: kishor Kumarr m
స్థలం: నారాయణవనం
తిరుపతి జిల్లా నారాయణవరం మండలం అరణ్యం కండ్రిగ పంచాయతీ గోవిందప్ప నాయుడు కండ్రిగలో వినాయకుని ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని యూత్ మరియు పిల్లలు అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో వినాయకుని ప్రతిమను గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.