క్రేజీ కల్యాణం సినిమాకు విశేష స్పందన వస్తుందని నరేష్ వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ కల్యాణం సినిమా ఈ నెల పదహారున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణం ప్రధానాంశమని నరేష్ తెలిపారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు.