స్థానిక సంస్థల ఎన్నికల వ్యాజ్యాలపై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం తీర్పులను రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అలాగే బీసీ రిజర్వేషన్ల అంశాలపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు.