చిట్వేల్‌లో ట్రాక్టర్ల తనిఖీ.. ఐదు ట్రాలీలు సీజ్!
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ పరిధిలో రహదారి భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో వెనుక వైపు రిఫ్లెక్టివ్ (రేడియం) స్టిక్కర్లు లేని ఐదు ట్రాక్టర్ ట్రాలీలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనల మేరకు వాహనాలకు జరిమానా విధించారు.
రాత్రి వేళల్లో రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్ఐ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ప్రతి వాహనానికి స్టిక్కర్లు, లైట్లు తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.