సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఐదు జాతీయ థీమ్‌లపై కేంద్రం ప్రకటన
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
దేశంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ జాతీయ థీమ్‌లను ప్రకటించింది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా యువత వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటూ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఐదు ప్రత్యేక అంశాలతో కూడిన ఈ వేదిక ద్వారా యువత తమ ఆలోచనలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.