ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిందని ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. చాలా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని, నవంబర్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తామని తెలిపారు. పులివెందుల సహా కొన్ని ప్రాంతాల్ లో మాత్రమే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని, విజయవాడలో సమయం పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు.