సీబీఐ, ఈడీ తీరుపై విజయ్ మాల్యా తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
భారత్లో బ్యాంకులకు బకాయిపడి విదేశాల్లో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు అభియోగాలు మోపారని మండిపడ్డారు. కోర్టు తీర్పు రాకముందే దర్యాప్తు సంస్థలు ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు.