తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన నేడు ఉదయం సూర్యప్రభ వాహనసేవ, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగుతుండగా, ఈ నెల 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.