వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలన్న ఎస్పీ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ప్రజలు, మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.