పాపికొండలు టూరిజం బోట్ల రాకపోకలు నిలిపివేత: అధికారుల ఉత్తర్వులు జారీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: రంపచోడవరం

తుఫాన్ ముప్పు పొంచివున్న కారణంగా పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా పదిహేనుకు పైగా టూరిజం బోట్ల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్తలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.