తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Tirupati

తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల రద్దీ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.