స్లీపర్ బస్సులో పదహారేళ్ల బాలిపై అత్యాచారం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Delhi

ఢిల్లీలో పదహారేళ్ల బాలికపై ప్రైవేట్ స్లీపర్ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు నాలుగో తేదీన నోయిడా వెళ్లాల్సిన మైనర్ను బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ తప్పుదారి పట్టించి కదులుతున్న బస్సులో ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల డీఎన్ఏ నమూనాలు బాధితురాలి శరీరంపై లభించిన ఆధారాలతో సరిపోలినట్లు ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై యాభై మంది సాక్షులతో మూడువందల తొంబై ఎనిమిది పేజీల భారీ ఛార్జ్ షీట్ను దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో సమర్పించారు.