వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని శంబంగి పిలుపు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈనెల 17వ తేదీ గురువారం నాడు బొబ్బిలి పట్టణంలోని సూర్య రెసిడెన్సీలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.