భారీ వర్షాల వేళ రహదారులపై కూలిన చెట్లను తొలగించిన శ్రీకాకుళం పోలీసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల కారణంగా కళింగపట్నం రహదారిపై నేలకొరిగిన చెట్లను జిల్లా పోలీసులు యుద్ధప్రాతిపదికన తొలగించారు. జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది తక్షణ సహాయక చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది.