సాయికృష్ణ అదృశ్యం కేసులో ఎంపీ గురుమూర్తిని నిలదీసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: దిల్లీ

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో వైకాపా ఎంపీ మద్దిల గురుమూర్తికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి మీకేంటి ఆసక్తి అని ఎంపీని ధర్మాసనం ప్రశ్నించింది. తల్లే పరిశీలించనప్పుడు మీకెందుకు ఆసక్తి అని నిలదీస్తూ హద్దు దాటి వెళ్లొద్దని హెచ్చరించింది. పోలీసు ఉన్నతాధికారులపై కేసు నమోదు, సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.