అమెరికాలో ప్రవాస విద్యార్థుల కోసం ఘనంగా టీఫాస్ స్టార్స్ పోటీలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Jersey

అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస తెలుగు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో టీఫాస్ స్టార్స్ 2026 పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ ఇరవై నాలుగు, ఇరవై ఐదు తేదీల్లో సంగీత, నృత్య, మోనోలాగ్ విభాగాలలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ పదిహేనేపులోగా పేర్లు నమోదు చేసుకోవాలని, విజేతలకు దీపావళి వేడుకల్లో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.