మృత్యు ఘంటికలు మోగిస్తూ భయానకంగా మారిన బయో ఎనర్జీ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇంధనాల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని స్టోరేజ్ ట్యాంక్ వద్ద అనుకోకుండా మంటలు చెలరేగడంతో ట్యాంకర్లోని ఆయిల్ పూర్తిగా దగ్ధమైంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలు తమ గ్రామాల వైపు వ్యాపించి ఏ ప్రమాదం తమపైకి ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.