రైతన్నలకు తీపి కబురు: నేడే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇవాళ ఏడు వేల రూపాయల చొప్పున జమ కానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అన్నదాతలకు భారీ ఊరట లభించనుంది.