జలదంకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా చేవూరు శశికళ ఖరారు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జలదంకి
నెల్లూరు జిల్లా జలదంకి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా సోమవరప్పాడు మాజీ సర్పంచ్ చేవూరు శశికళను ఉదయగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఖరారు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.