తెలంగాణలో సరికొత్త రికార్డు సృష్టించిన గరిష్ట విద్యుత్ డిమాండ్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా పన్నెండు వేల నలభై నాలుగు మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వినియోగం తారాస్థాయికి చేరుకోవడంతో ఈ ఆల్ టైమ్ రికార్డు సృష్టించబడింది. గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాల నుంచి వినియోగం విపరీతంగా పెరగడం వల్లే ఈ మైలురాయి నమోదైందని, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.